ఆకట్టుకున్న చిరుధాన్యాల ప్రదర్శన

ABN , First Publish Date - 2023-03-25T23:24:13+05:30 IST

స్ధానిక ఎలమెంట్రీ స్కూల్‌ ఆవరణంలోని అంగనవాడి కేంద్రంలో శనివారం నిర్వహించిన చిరుధాన్యాల ప్రదర్శన ఆకట్టుకుంది.

ఆకట్టుకున్న చిరుధాన్యాల ప్రదర్శన
చిరుధాన్యాల ప్రదర్శన

ములకలచెరువు, మార్చి 25: స్ధానిక ఎలమెంట్రీ స్కూల్‌ ఆవరణంలోని అంగనవాడి కేంద్రంలో శనివారం నిర్వహించిన చిరుధాన్యాల ప్రదర్శన ఆకట్టుకుంది. పోషక పక్వాడ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలతో ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ మంజులకుమారి, సర్పంచ రహమతబీ, అంగనవాడీ కార్యకర్తలు అమరావతి, ధనలక్ష్మి, రమీజా, ఎఎనఎం సరస్వతి, నాయకులు చాంద్‌బాషా, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చిరుధాన్యాల సాగుతో అధిక ఆదాయం

కలకడ, మార్చి 25:రైతులు చిరుధాన్యాల పంటను పండించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చన్ని కేవీకే కోఆర్డినే టర్‌ డాక్టర్‌ జీఎస్‌ పాండురంగ అన్నారు. కేవీకే శాస్త్రవేత్త దత్తత గ్రామంగా ఎంచుకొన్న కలకడ మండలంలోని ముడియంవారిపల్లెని ఆయన పరిశీలించి మాట్లాడుతూ తక్కువ నీటి వనరులు, ఎరువులతో రైతులు ఈ పంటలు సాగు చేయవచ్చన్నారు. పెరటి కోళ్ల పెంపకం, బొప్పాయి, మిరపలో యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. సేంద్రి య పద్ధతుల్లో సాగు చేసిన వేరుశనగ, టమోటా పంటను ఆశించే పురుగులు, తెగుళ్లు నివారణ పద్దతులను క్షేత్ర స్థాయిలో పరిశీలించా రు. కార్యక్రమంలో గృహ ఉద్యానవన శాస్త్రవేత్త జ్యోతి, శాస్త్రవేత్తలు నవీన, మాధురి, శ్రీనివాసులు, ఫీరుసా హెబ్‌, ఏవో గౌరి, సర్పంచ శాంతమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:24:13+05:30 IST