ప్రజలనుకుంటే గాల్లో కలిసిపోతారు

ABN , First Publish Date - 2023-01-24T23:42:26+05:30 IST

: ఎనిమిది వేల సైన్యాన్ని తయారుచేసుకున్నానని, తన ఊపిరి ఉన్నంత వరకు టీడీపీ జెండాను ప్రొద్దుటూరులో ఎగరనివ్వనని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, ప్రజలు అనుకుంటే ఆ సైన్యం గాల్లో కలిసిపోతుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీఎస్‌ ముక్తియార్‌ ఘాటుగా మాట్లాడారు.

ప్రజలనుకుంటే గాల్లో కలిసిపోతారు
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేత వీఎస్‌ ముక్తియార్‌

ప్రొద్దుటూరులో ఎగిరేది టీడీపీ జెండానే ఫ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీఎస్‌ ముక్తియార్‌

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 24 : ఎనిమిది వేల సైన్యాన్ని తయారుచేసుకున్నానని, తన ఊపిరి ఉన్నంత వరకు టీడీపీ జెండాను ప్రొద్దుటూరులో ఎగరనివ్వనని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, ప్రజలు అనుకుంటే ఆ సైన్యం గాల్లో కలిసిపోతుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీఎస్‌ ముక్తియార్‌ ఘాటుగా మాట్లాడారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ ఆ 8వేల పైన్యంలో స్మగ్లర్లు, క్రికెట్‌బుకీలు, అక్రమ మద్యం, గుట్కా విక్రేతలు ఉన్నారన్నారు. తాజాగా రాచమల్లు సైన్యంలోని సైనికురాలు బొందెలి కార్పొరేషన్‌ డైరక్టర్‌ రసపుత్ర రజనీ కర్నాటకలో నకిలీనోట్లు చెలామణి చేస్తూ అక్కడి పోలీసులకు పట్టుబడి రిమాండులో ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడే వ్యక్తులున్న సైన్యంతో టీడీపీకి ఎలాంటి నష్టం లేదంటూనే ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, టీడీపీని గెలిపించడం ఖాయమన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే, ఏడాదికి రూ.500 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే ఇంతవరకు ఎన్ని కోట్లు తెచ్చి అభివృద్ధి చేశారో ప్రజలకు తెలియజేయాలన్నారు. ముస్లింలకు దత్తపుత్రున్ని అని చెప్పుకునే ఎమ్మెల్యే రాచమల్లు, ప్రతి మసీదు కమిటీలో జోక్యం చేసుకుని, ముస్లింల్లో చిచ్చుపెట్టారని ముక్తియార్‌ ఆరోపించారు. జామీయా మసీదుకు కమిటీ లేకుండా వక్ఫ్‌బోర్డుకు అప్పగించడమేమిటన్నారు. ఇవన్నీ ముస్లిం ప్రజలు గమనించాలన్నారు. ఇలా అన్ని వర్గాల్లోనూ చిచ్చు పెట్టి ఎమ్మెల్యే తన పబ్బం గడుపుకుంటున్నారని, ఇవన్నీ బయటపెడతామని, ప్రజలకు తెలియజేస్తామన్నారు.అహంతో తమ నేతలను ఇష్టానుసారం మాట్లాడటాన్ని తీవ్రం గా ఖండిస్తున్నామన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్యేకి ముక్తియార్‌ హితవు పలికారు. ప్రొద్దుటూరులో జెండా ఎగరడం ఖాయమన్నారు. సమావేశంలో టీడీపీ మైనార్టీ నాయకులు కుతుబుద్దీన్‌, ఖలీల్‌బాష, అలీబేగ్‌, బాబయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:42:42+05:30 IST