ఎస్సీ శ్మశాన వాటికలకు భూములు గుర్తించండి

ABN , First Publish Date - 2023-03-25T22:37:36+05:30 IST

ఎస్సీ శ్మశాన వాటికల కోసం భూములు గుర్తించాలని శనివారం సాయంత్రం విజయవాడ నుంచి ముఖ్యమంత్రి కా ర్యాలయపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు జిల్లా కలెక్ట ర్లను ఆదేశించారు.

ఎస్సీ శ్మశాన వాటికలకు  భూములు గుర్తించండి
ముత్యాల రాజు వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైన కలెక్టర్‌

- సీఎంఓ కార్యదర్శి ముత్యాలరాజు

రాయచోటి(కలెక్టరేట్‌), మార్చి25: ఎస్సీ శ్మశాన వాటికల కోసం భూములు గుర్తించాలని శనివారం సాయంత్రం విజయవాడ నుంచి ముఖ్యమంత్రి కా ర్యాలయపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు జిల్లా కలెక్ట ర్లను ఆదేశించారు. కాన్ఫరె న్స్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అవసరమైన చోట్ల ఎస్సీ శ్మశాన వాటికలకు భూమి గుర్తింపు ప్రక్రియ, అసైన్మెంట్‌ వ్యవసాయ భూములు, చుక్కల భూము ల వివరాలు, లంక ల్యాండ్స్‌ గుర్తింపు తదితర అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. అసైన్‌ మెంట్‌ భూముల గుర్తింపులో నివేదికలను పక్కాగా రూపొందించాలని ఆ తర్వాత పబ్లికేష న్‌ జారీ చేయాలన్నారు. భూముల గుర్తింపు ప్రక్రియ, తుది జాబితా రూపకల్పనలో తేడా రాకుండా పక్కాగా నివేదికలను రూపొందించాలన్నారు.

అన్నిచోట్లా నిబంధనల ప్రకారం అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశాలను నిర్వహించాలని సూచించారు. లంకా ల్యాండ్స్‌ భూ ముల గుర్తింపుపై ముగ్గురు సభ్యుల కమిటీ ఆమోదం తీసుకోవాలన్నారు. ఎస్సీ శ్మశాన వాటికలకు సంబంధించి ఆయా మండలాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని, చుక్కల భూముల నివేదికలను కూడా నిబంధనల మేరకు రూపొందించా లని సూచించారు. ఆయా అంశాలకు సంబంధించి జిల్లాలోని లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌కు అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ గిరీషా, సమాచార శాఖ నుంచి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T22:37:36+05:30 IST