ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి

ABN , First Publish Date - 2023-02-07T02:41:18+05:30 IST

తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీలు డిమాండ్‌ చేశారు. వీరు దీర్ఘకాలింకగా ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వేలాది మంది కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూడున్నరగంటల పాటు కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు.

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి

అంగన్వాడీల డిమాండ్‌

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

కడప (ఎర్రముక్కపల్లె), ఫిబ్రవరి 6 : తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీలు డిమాండ్‌ చేశారు. వీరు దీర్ఘకాలింకగా ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వేలాది మంది కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూడున్నరగంటల పాటు కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియయన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు ఆర్‌.లక్ష్మిదేవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి ఆమె మాట్లాడుతూ 26వేలు కనీస వేతనం, ఫేషియల్‌ యాప్‌ రద్దు, సుప్రీం తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్‌ల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. సీఎం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే తెలంగాణకంటే అధిక వేతనాలు ఇస్తామని చెప్పిన జగన్‌ ఇప్పుడు పట్టించుకోకపోవడం సరికాదన్నారు.

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వాలు అంగన్వాడీల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ పనిభారాన్ని తీవ్రంగా పెంచాయని ఆ మేరకు వేతనాలు పెంచలేదని ఆరోపించారు. అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో అన్న చందంగా ప్రభుత్వ తీరు మారిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కర్ణాటక రాష్ట్రంలో అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేస్తుండగా ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. సాఽధారణ కార్మికులు, అంగన్వాడీలపై సీఎంకు ప్రేమ లేదని ధ్వజమెత్తారు. అంగన్వాడీ పోరాటాలకు సీఐటీయూ అండగా ఉంటుందని రాష్ట్ర స్థాయి పోరాటానికి ప్రత్యక్ష మద్దతునిస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు కుష్మావతి, భాగ్యమ్మ, వినోద, విజయ, అంజనాదేవి, చంద్రారెడ్డి, సుంకర రవి, నాగేంద్రబాబు, వె ంకటసుబ్బయ్య, దీప, సుబ్బలక్ష్మితో పాటు అంగన్వాడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T02:41:23+05:30 IST