మానవత శాంతి ర్యాలీ
ABN , First Publish Date - 2023-08-19T23:14:23+05:30 IST
మానవత్వానికి మించిన ఆస్తి లేదని, ప్రజలందరూ శాంతి మార్గంలో పయనించాలని తహశీల్దారు శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వారోత్సవాల్లో భాగంగా శనివారం చిట్వేలి శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీని నిర్వహించారు.
చిట్వేలి, ఆగస్టు 19: మానవత్వానికి మించిన ఆస్తి లేదని, ప్రజలందరూ శాంతి మార్గంలో పయనించాలని తహశీల్దారు శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వారోత్సవాల్లో భాగంగా శనివారం చిట్వేలి శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీని నిర్వహించారు. జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏబీఎన్ ప్రసాద్, ఎన్‌సీసీ అధికారి పశువుల రాజశేఖర్ పర్యవేక్షణలో ఎన్‌సీసీ విద్యార్థులు, సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు, మానవత సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఈవో కోదండనాయుడు పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. దాత కంచర్ల సుధీర్‌రెడ్డి అందరికీ బిస్కెట్లు, శీతలపానీయాలు అందించారు. పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ వైఎస్సార్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి మానవతా సేవలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో చైర్మన్ చౌడవరం సురేంద్రరెడ్డి, అధ్యక్షుడు కె.సాయిరాం, కార్యదర్శి మునిరావ్, అడ్వైజర్ బోర్డు సభ్యులు నరసరామయ్య, తిరుమల విశ్వనాధం, జానీ, శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వర్లు, సభ్యులు సుమన్, సుబ్రమణ్యంరెడ్డి, రియాజ్ బాషా, సుదీర్‌రెడ్డి తదితరులుపాల్గొన్నారు.