అంతర పంటలతో అధిక లాభాలు

ABN , First Publish Date - 2023-05-25T23:50:05+05:30 IST

ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా అంతర పంటలు పండించడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని రైతు సాధికార సంస్థ రాష్ట్ర ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ రాజేష్‌ పేర్కొన్నారు.

అంతర పంటలతో అధిక లాభాలు
ప్రకృతి వ్యవసాయ పంటలు పరిశీలిస్తున్న దృశ్యం

వాల్మీకిపురం, మే 25: ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా అంతర పంటలు పండించడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని రైతు సాధికార సంస్థ రాష్ట్ర ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ రాజేష్‌ పేర్కొన్నారు. గురువారం వాల్మీకిపురం మండలంలోని చింతపర్తిలో ప్రకృతి వ్యవసా యం ద్వారా రైతు నాగేంద్రరెడ్డి పండించిన పం డ్ల తోట మోడల్‌ను రాజస్థాన రాష్ట్రంకు చెందిన 10మంది మహిళా రైతులు పరిశీలించారు. రైతుకు నిరంతర ఆదాయం వచ్చేందుకు అంతర పంటలు వేయించడం వల్ల ప్రతి రోజూ ఆదాయం ఉంటుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రెడ్డిబాషా, మునీరా, పెద్దరెడ్డెయ్య, హరినాథరెడ్డి, శ్రీనాథరెడ్డి, రాజస్థాన రాష్ట్ర మహిళ రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T23:50:05+05:30 IST