ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2023-01-11T23:13:22+05:30 IST

మైలవరం ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

 ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు

మైలవరం, జనవరి 11: మైలవరం ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సిన్‌ నిల్వ లు, పలు రికార్డులను ఆయ న తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిధిలో గర్భిణుల వివరాల నమోదు, ఓపీ తదితర విషయాలను సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు సిబ్బంది కూడా తప్పని సరిగా హాజరు కావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసిబ్బంది దీర్ఘకాలిక పేషంట్లకు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయాలని, సిబ్బంది తీసుకొవాల్సిన పలు విషయాలపై సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ ఉమామహేశ్వర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శాంతికళ, మైలవరం వైద్యాధికారి చంద్రకుమార్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-01-11T23:13:39+05:30 IST