దళితుల భూమిని ఆక్రమించాడు
ABN , First Publish Date - 2023-06-26T22:39:46+05:30 IST
గతం లో దళితులకు ప్రభుత్వం అందించిన భూమిని ఆక్ర మించుకుని పెద్ద భవంతి నిర్మించుకున్నాడంటూ పీలేరు మండలం ఎర్రగుం టపల్లె ఎంపీటీసీ సభ్యుడు అమరనాథరెడ్డిపై మాల మహానాడు నాయకులు తహసీల్దారు ఫిర్యాదు చేశారు.
ఎంపీటీసీ సభ్యుడిపై ఫిర్యాదు
పీలేరు, జూన్ 26: గతం లో దళితులకు ప్రభుత్వం అందించిన భూమిని ఆక్ర మించుకుని పెద్ద భవంతి నిర్మించుకున్నాడంటూ పీలేరు మండలం ఎర్రగుం టపల్లె ఎంపీటీసీ సభ్యుడు అమరనాథరెడ్డిపై మాల మహానాడు నాయకులు తహసీల్దారు ఫిర్యాదు చేశారు. ఎర్రగుంటపల్లెకు చెందిన చీకటిపల్లె లక్ష్మ య్యకు ప్రభుత్వం గతంలో ఎర్రగుంటపల్లె పంచాయతీ సర్వే నెం.562/2లో ఖాతా నెంబరు 209తో 50 సెంట్ల భూమి కేటాయించింది. అయితే అనారోగ్య కారణాలతో లక్ష్మయ్య, అతని కుమారుడు బైండింగ్ శంకర మృతి చెందారు. శంకర వారసులు జీవనోపాధి కోసం పీలేరు రాజీవ్ నగర్ కాలనీలో స్థిరప డ్డాడు. ఇదే అదునుగా భావించిన అమరనాథరెడ్డి ఆ భూమిని ఆక్రమించుకో వడమే కాకుండా, అందులో పెద్ద వాణిజ్య భవనం కట్టుకున్నాడు. ఇదేమిటని ప్రశ్నించిన శంకర కుమారుడు శివసాయి, అతని బంధువులతో అమరనాథ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వారు పీలేరులోని మాలమహానాడు నాయకులను సంప్రదించగా వారు సోమవారం తహసీల్దారు కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందించారు.ఎంపీటీసీ సభ్యుడి పై చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ భూమిని వెంటనే లక్ష్మయ్య వారసు లకు అందజేయాలని డిమాండ్ చేశారు. గుర్రం నారాయణ, నక్కా వెంక ట రమణ, విశ్వకాంత్, రాజు, రమణ, తదితరులు పాల్గొన్నారు.