రాజకీయ కుట్రతోనే చంద్రబాబుపై వేధింపులు
ABN , First Publish Date - 2023-09-25T23:34:43+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై రాజకీయ కుట్రతోనే సీఎం జగనఅక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేసి వేఽధిస్తున్నారని మదన పల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ ధ్వజమెత్తారు.

మదనపల్లె టౌన, సెప్టెంబరు 25: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై రాజకీయ కుట్రతోనే సీఎం జగనఅక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేసి వేఽధిస్తున్నారని మదన పల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయం ఎదుట దొమ్మలపాటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరా హార దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దొమ్మలపాటి మాట్లాడుతూ రూ.42వేల కోట్లు అవినీతికి పాల్పడ్డ జగన, చంద్రబాబుకు అవినీతి మరకలు అంటిం చాలని చూస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతి జరిగిందని వైసీపీ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాలు స్కిల్‌డెవలప్‌మెంట్‌లో సిమెన్స ఒప్పందం కుదుర్చుకుందని అక్కడ లేని అవినీతి ఇక్కడ ఎలా జరిగి ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి ఇప్పటికే బెయిల్ మంజూ రైందని, కాని చంద్రబాబుకు బెయిల్ రాకపోవడం చూస్తే జగన వ్యవస్థలనే ఆడిస్తున్నా రన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొమ్మలపాటి యశశ్విరాజ్, ఆర్‌జే వెంకటేశ, మునిరత్న, రెడ్డెప్పరెడ్డి, సుధాకర్, చంద్ర, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
బటన రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది
రామసముద్రం, సెప్టెంబరు 25: బటనరెడ్డి జగనరెడ్డికి ఓటమి భయం పట్టుకుందని మదనపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ సోమవారం రామస ముద్రం మండలం కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి కుట్రలు పన్నుతూ ప్రతిపక్ష పార్టీలను బలహీన పరచాలని సీఎం జగన చూస్తున్నారని ఇలా ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన ప్పటి నుంచి పోలీసులను ఉసిగొలిపి టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపులు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలు, పార్టీ నాయకులు అందరూ కలిసి కట్టుగా ఈ సైకో పాలనకు చమరగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్ర మంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షులు కృష్ణంరాజు, హరినాథ్‌రెడ్డి, చెంగారెడ్డి, రమణ, గొర్లెదొడ్డి శీనప్ప, మైనార్టీ జిల్లా నాయకుడు ఒంటెల అల్తాఫ్‌బాషా, హోటల్ నారాయణ, చాను,చాంద్‌బాషా, కిట్ట, వాల్మీకి కిట్ట, ఎల్.శివ, పాలు శీనా, జావీద్, ఆవుల చాంద్‌బాషా, డిష్ కృష్ణప్ప, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.