పేదల కోసమే గురివిరెడ్డి జీవితం : సీపీఎం
ABN , First Publish Date - 2023-05-25T22:45:00+05:30 IST
పేదల కోసమే కామ్రేడ్ ఎత్తపు గురివిరెడ్డి జీవితాన్ని అంకితం చేశారని సీపీ ఎం నేతలు అన్నారు.

బ్రహ్మంగారిమఠం, మే 25: పేదల కోసమే కామ్రేడ్ ఎత్తపు గురివిరెడ్డి జీవితాన్ని అంకితం చేశారని సీపీ ఎం నేతలు అన్నారు. కామ్రేడ్ గురి విరెడ్డి ప్రధమ సంస్మరణ సభ సం దర్భంగా వికలాంగుల కాలనీకి కామ్రేడ్ గురివిరెడ్డి కాలనీగా నామకరణం చేసిన వారు మాట్లాడుతూ కామ్రేడ్ గురివిరెడ్డి 20 ఏళ్లకు పైగా పార్టీలో సభ్యుడు, శాఖ కార్యదర్శి, మండల, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల్లో జరిగిన ప్రజా పోరాటాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. మండల కార్యదర్శి గోవిందు, సీపీఎం జిల్లా కమిటీ కార్యదర్శి చంద్రశేఖ ర్, జిల్లా కార్యవర్గ సభ్యులు శివకుమార్, సీపీఎం జిల్లా, మండల కమిటీ సభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు.