కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2023-06-02T23:16:14+05:30 IST

కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య విమర్శించారు.

కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
మాట్లాడుతున్న కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య

కడప (సెవెన్‌రోడ్స్‌), జూన్‌ 2 : కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య విమర్శించారు. శుక్రవారం స్థానిక హోచిమన్‌భవన్‌లో కౌలు రైతు సంఘం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాటమయ్య మాట్లాడుతూ తక్షణం కౌలు రైతులకు గుర్తింపుకార్డులను మంజూరు చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ ప్రాజెక్టులను నిర్మించి పంట కాల్వల ద్వారా రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లను బిగించాలనే ఆలోచన దుర్మార్గమన్నారు. పంటను రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్‌వీ సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొమ్మద్ది ఈశ్వరయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి మాట్లాడారు. ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు మనోహర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, మురళి, చంద్రశేఖర్‌రెడ్డి మరియు కౌలు రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:16:14+05:30 IST