‘పాల ఏకరి కులానికి ప్రభుత్వం చేసిందేం లేదు’

ABN , First Publish Date - 2023-06-12T22:33:22+05:30 IST

పాల ఏకరి కులాల సంక్షేమానికి జగన్‌ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని పాల ఏకరి సంఘం అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు గురిగింజకుంట భాస్కర్‌ నాయు డు అన్నారు.

‘పాల ఏకరి కులానికి ప్రభుత్వం చేసిందేం లేదు’
మాట్లాడుతున్న పాల ఏకరి సంఘం నేత భాస్కర్‌నాయుడు

రామాపురం, జూన్‌ 12: పాల ఏకరి కులాల సంక్షేమానికి జగన్‌ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని పాల ఏకరి సంఘం అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు గురిగింజకుంట భాస్కర్‌ నాయు డు అన్నారు. సోమవారం మండల కేంద్రం లోని రామాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పాల ఏకరి కులాల ను ప్రభుత్వం గుర్తించలేదని, వారికి అన్ని రంగాల్లో అవకాశం కల్పించలేదన్నారు. రాష్ట్రంలో పాల ఏకరి కులాలకు చెందిన వారు 30 లక్షల మంది ఉన్నారన్నారు పాల ఏకరి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రెండేళ్లు కావస్తున్నా ఏ ఒక్కరికీ న్యాయం జరగలేద న్నారు. రాష్ట్రంలో తమ కులానికి చెందిన యువత నిరుద్యోగులుగా ఉన్నారే తప్ప, వారికి ప్రభుత్వం చేసింది ఏం లేదన్నారు. అధికార పార్టీ కి చెందిన కొందరు నాయకులు తమ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం సరి కాదన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ కులానికి మేలు జరగేలదన్నారు. ఈ నెల 29న అన్నమయ్య జిల్లా రాయచోటిలో పాల ఏకరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. రాష్ట్రంలోనే అన్ని జిల్లాల పాల ఏకరిసంఘాల అధ్యక్షులు హాజరుకావాలని ఆయన కోరారు.

Updated Date - 2023-06-12T22:33:22+05:30 IST