అనాధ గోవుల రక్షణ కోసమే గోశాల
ABN , First Publish Date - 2023-05-17T22:45:47+05:30 IST
కడప నగరంలో గోవుల పరిరక్షణ నిమిత్తం రూ. 36 లక్ష లతో గోశాల నిర్మించారని, ఇం దులో నగరంలో తిరుగుతున్న అనాధ గోవులను పరిరక్షిస్తామ ని మేయరు సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, కార్పొరేషన్ కమిషనరు ప్రవీణ్‌చంద్ పేర్కొన్నారు.
36 లక్షలతో ఏర్పాటు ఫ ప్రారంభించిన మేయర్, కమిషనర్
కడప (ఎర్రముక్కపల్లె), మే 17: కడప నగరంలో గోవుల పరిరక్షణ నిమిత్తం రూ. 36 లక్ష లతో గోశాల నిర్మించారని, ఇం దులో నగరంలో తిరుగుతున్న అనాధ గోవులను పరిరక్షిస్తామ ని మేయరు సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, కార్పొరేషన్ కమిషనరు ప్రవీణ్‌చంద్ పేర్కొన్నారు. 17వ డివిజన్ పరిధిలో బుగ్గవంక అగ్రహారంలో నిర్మించిన గోశాలను ప్రారంభించిన వారు మాట్లాడుతూ అనాధ గోవుల సంరక్షణకు కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోశాల నిర్మాణం చేశామన్నారు. కడప కార్పొరేషన్ పరిధిలోని అనాధ గోవులను గుర్తించి గోశాలకు తరలించి వాటి సంరక్షణను చూస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్‌బేగం, నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.