‘పది’లో మంచి ఫలితాలు సాధించాలి
ABN , First Publish Date - 2023-03-18T23:38:02+05:30 IST
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బాగా రాసి ఫలితాలను సాధించాలని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జాకీర్‌హుస్సేన్ సూచించారు.

గాలివీడు, మార్చి 18: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బాగా రాసి ఫలితాలను సాధించాలని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జాకీర్‌హుస్సేన్ సూచించారు. శనివారం ఆయన స్థానిక బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థు లతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పటికైనా విద్యార్థులు ఒక ప్రణాళిక ప్రకారం చదవాలని సూచించారు. ఉపాఽధ్యాయుల సూచనలను పాటిస్తూ పాఠ్యాంశాలను రివిజన్ చేసుకోవా లన్నారు. అనంతరం విద్యార్థుల హాజరు పట్టిక, మెనూ పాటిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ పరికరాలను, మరుగుదొడ్లు, వసతి గృహాన్ని పరిశీలించారు. వార్డెన్ రవీంద్రనాయక్, రవిబాబు, వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు.