శేషవాహనంపై పట్టాభిరాముడి వైభవం

ABN , First Publish Date - 2023-03-30T23:17:01+05:30 IST

వాల్మీకిపురం పట్టణంలోని పట్టాభిరామాలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం టీటీడీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

శేషవాహనంపై పట్టాభిరాముడి వైభవం
శేషవాహనంపై పట్టాభిరాముడి నగరోత్సవం

కన్నుల పండువగా ఊంజల్‌సేవ

వాల్మీకిపురం, మార్చి 30: వాల్మీకిపురం పట్టణంలోని పట్టాభిరామాలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం టీటీడీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఉదయం సుప్రభాతసేవ, ఆలయంలోని మూలవర్లకు అభిషేకం, అర్చన, తోమాలసేవలతో ప్రత్యేక పూజలు జరిగాయి. భోగోత్సవమూర్తులైన సీతారామలక్ష్మణులను సర్వభూపాల వాహనంపై విశేష అలంకరణలు చేసి పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలో యాగశాల వైధిక కార్యక్రమాల అనంతరం ఉత్సవమూర్తులకు వేదపండితులకు మంత్రోచ్ఛారణల నడుమ స్నపనతిరుమంజనం వేడుకగా సాగింది. సాయంత్రం ఆలయ మండపంలో భక్తుల నడుమ రాముడి ఊంజల్‌సేవ కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం రాత్రికి పెద్దశేష వాహనంపై విశేషాలంకృతుడైన సీతాలక్ష్మణ సమేత పట్టాభిరాముడిని పురవీధుల గుండా నగరోత్సవం నిర ్వహించగా భక్తులు దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా టీటీ డీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల చలిపిండి దీపారాధనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం సూర్యప్రభవాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం, ఊంజల్‌సేవ, రాత్రికి మోహిని అవతారుడైన పట్టాభిరాముడి నగరోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. కార్యక్రమాల్లో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T23:17:01+05:30 IST