వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2023-05-02T22:56:48+05:30 IST

చెన్నకేశవ సంజీవరాయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వెల్లాలలో శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు.

వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణం
శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం,

రాజుపాలెం, మే 2 : చెన్నకేశవ సంజీవరాయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వెల్లాలలో శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, డప్పువాయిద్యాలతో కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన మహిళలు ఈ కల్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదానం చేశారు. కల్యాణాన్ని చైర్‌పర్సన్‌ కాణాల విజయలక్ష్మి, ఈవో నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. జమ్మలమడుగు నుంచి వచ్చిన కోలాటం బృందం నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Updated Date - 2023-05-02T22:57:00+05:30 IST