మాండవ్యనది ఒడ్డున గర్ల్స్ హైస్కూల్
ABN , First Publish Date - 2023-07-14T23:15:03+05:30 IST
మండలంలోని మాండవ్యనది ఒడ్డున బాలికల కోసం హైస్కూల్‌ను ఏర్పాటు చేశారు. అయితే నది ఒడ్డున పాఠశాల ఉండడం సరికాదని, పాఠశాలకు వెళ్లాలన్నా సరైన దారికూడా లేదని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
భయం గుప్పెట్లో తల్లిదండ్రులు
దారి, ప్రహరీ లేక తీవ్ర ఇబ్బందులు
చిన్నమండెం, జూలై14: మండలంలోని మాండవ్యనది ఒడ్డున బాలికల కోసం హైస్కూల్‌ను ఏర్పాటు చేశారు. అయితే నది ఒడ్డున పాఠశాల ఉండడం సరికాదని, పాఠశాలకు వెళ్లాలన్నా సరైన దారికూడా లేదని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నమండెం మండల కేంద్రంలోని సంత తో పు వద్ద మాండవ్యనది ఒడ్డున జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాలను నిర్మించారు. అయితే పాఠశాలకు వెళ్లాలంటే కనీ సం దారి సౌకర్యం కూడా సరిగ్గా లేదు. శువ్రారం వారాంతపు సంత జరిగితే పరిస్థితి మరీ దారుణం. మరో పక్క మాండవ్య నది ఒడ్డున కనీసం నాలుగైదు మీటర్ల వ్యవధిలోనే పాఠశాల ఉంఇ. అయితే వర్షాకాలం మాండవ్యనది ఉధృతంగా ప్రవహి స్తే ఏదైనా జరిగితే ఇక అంతే సంగతులు. పాఠశాల చుట్టూ గుబురుగా పెరిగిన ముళ్ల పొదలు, కంపచెట్లు దర్శనమిస్తు న్నాయి.
ఈ గుబురు పొదల నుంచి ఎటు నుంచి పాములు వస్తాయోనని కనీసం ప్రహరీ లేకపోవడంతో విద్యార్థుల తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాం తాల్లో యువకులు ఎప్పుడు చూసినా తిరుగుతుంటారని వంక పక్కన కంపచెట్ల వెంబడి కనీసం ప్రహరీ కూడా లేక ఈడొచ్చి న ఆడపిల్లలను ఎలా పంపించాలని పలువురు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవిం చినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దారి, ప్రహరీ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
భోజన సమయంలో తీవ్ర ఇబ్బందులు
పాఠశాలలో 261 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవలే దాదాపు కోటి రూపాయలపైన వెచ్చించి నాడు- నేడు కింద ఈ పాఠశాలను పనులు పూర్తయినా కనీసం వంటగది లేక ఎండుటెండలో విద్యార్థులు నిల్చొని భోజనాలు పెట్టించు కుంటున్నారు. కనీసం మంచినీరు కూడా లేక పాఠశాల ప్రాంగణలో ఉన్న చేతి బోరును ఉపయోగించుకుంటున్నారు.
పంచాయతీ సెక్రటరీ పద్మావతమ్మ వివరణ ఇస్తూ ఈ పాఠ శాలకు దారి వేయాలంటే పంచాయతీలో ప్రస్తుతానికి నిధులు లేవు. ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లాం. నిధులు వచ్చిన వెంటనే దారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.