నిషేధంలోనూ చేపల వేట
ABN , First Publish Date - 2023-07-21T22:53:30+05:30 IST
నిషేధ కాలంలోనూ చేపలవేట కొనసాగుతోంది. పోరుమామిళ్ల చెరు వులో యధేచ్ఛగా అమ్మకాలు సాగుతున్నా అధికా రులు చోద్యం చూస్తున్నారనే విమర్రశలున్నాయి.
పోరుమామిళ్ల చెరువులో అమ్మకాలు
చోద్యం చూస్తున్న అధికారులు
పోరుమామిళ్ల, జూలై 21: నిషేధ కాలంలోనూ చేపలవేట కొనసాగుతోంది. పోరుమామిళ్ల చెరు వులో యధేచ్ఛగా అమ్మకాలు సాగుతున్నా అధికా రులు చోద్యం చూస్తున్నారనే విమర్రశలున్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో చేపలు గుడ్లుపెట్టే సమ యం కాబట్టి చేపలు పట్టరాదన్న నిబంధనలు న్నా స్థానిక నేతల అండదండలతో, అధికారులు ఉదాశీనత ప్రదర్శించడంతో చెరువులో చేపల వేట జోరుగా సాగుతోంది. నియంత్రించాల్సిన అధికారులే సహకరిస్తుండడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. వివరాల్లోకెళితే....
సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో చేపలు పిల్లలు అభివృద్ధి చెందే సమయం. ఈ సమయం లో చేపల వేట పూర్తిగా నిషిద్దం అని ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ నెలల్లో వర్షాలు మెం డుగా కురవడం, చేపలు గుడ్లు పెట్టేందుకు అను కూలంగా ఉండడంతో చేపలవేటపై ఆధారపడి జీవించే వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూ పుతోంది. అయితే ఇవేవీ తమకు వర్తించవంటూ కొందరు సొసైటీ అనుమతులు ఉన్నాయని చెబుతూ చేపల వేట జోరుగా సాగిస్తున్నారు. నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి చెరువులో బోట్లునడిపి చేపలు తెచ్చేవారికి ఆ ప్రాంతంలోనే గుడారాలు ఏర్పాటు చేసి చేపల వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు.
పోరుమామిళ్ల చెరువుకు ఇటీవల బ్రహ్మంసాగర్ నీరు వదిలినా రైతుల కో సం పెద్దతూము చిన్న తూము నుంచి నీరు వదలడంతో చేపలు పట్టే వారికి పని సులువైంది. ఇదే తడవుగా బోట్లతో చేపలు పడుతూ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక నేతలు, కానీ అఽధికారులు కానీ నోరు మెదకపోవడం విడ్డూరంగా ఉంది. హైబ్రిడ్ చేపలు కదా, మేం వదలినవే కదా, పట్టుకుంటే ఏమవుతుందన్న ధీమాతో ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నా రు. చెరువు వద్ద అయితే ప్రాణంతో ఉన్న చేపలు కిలో రూ.100 లేక 120కి అమ్ముతారనే ఉద్దేశంతో పోరుమామిళ్ల వాసులు కూడా అక్కడికి వెళుతున్నారు. ఈ ప్రాంతీయుల కు అమ్మగా మిగిలిన చేపలను ఐస్ బాక్సుల్లో ప్యాకింగ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నా రు. శుక్రవారం చెరువులో చేపల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోట్లలో ఒక్కోబోటులో ఇద్దరు వలలు తీసుకెళ్లి చేపలను పట్టారు. తమను ఎవరూ ఏమీ అనరనే ధీమాతో వారు ఈ చేపలను నిషేధ సమయంలో పట్టడం, అమ్మకాలు జరపడం విడ్డూరంగా ఉంది. నిషేధకాలంలో చేపలను పట్టరాదన్న నిబంధనలను సైతం వారు తుంగలో తొక్కుతున్నారు. అధికారు లు సహకరించారనే వాదన బలంగా ఉన్నా తమను ఎవరేమీ అనలేరనే ధీమాతో వ్యాపారు లున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై డిప్యూటీ డైరెక్టరు రామలింగేశ్వరాచారిని వివరణ కోరేందు కు యత్నించగా ఆయన అందుబాటులో లేరు. ఫోన్ చేసినా ఆయన నుంచి స్పందన కరువైంది.