నేత్రదానం పుణ్యకార్యం

ABN , First Publish Date - 2023-05-25T23:01:49+05:30 IST

నేత్రదానం పుణ్యకార్యమని స్నేహిత అమృత హస్తం సేవా సమితి నేత్రనిధి అధ్యక్షుడు రాజు పేర్కొన్నారు.

నేత్రదానం పుణ్యకార్యం

చెన్నూరు, మే 25 : నేత్రదానం పుణ్యకార్యమని స్నేహిత అమృత హస్తం సేవా సమితి నేత్రనిధి అధ్యక్షుడు రాజు పేర్కొన్నారు. మండలంలోని ముండ్లపల్లెకు చెందిన గోసుల రామసుబ్బారెడ్డి (72) గురువారం అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన నేత్రాలను భార్య పద్మావతమ్మ, కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ విషయం పులివెందులకు చెందిన స్నేహిత అమృత హస్తం సేవా సమితి నేత్రనిధి అధ్యక్షుడు రాజుకు రామసుబ్బారెడ్డి తెలపడంతో ఆయన టెక్నీషియన్‌ హరి్‌షతో అక్కడికి చేరుకుని నేత్రాలను సేకరించారు. అనంతరం రాజు మాట్లాడుతూ నేత్రదానం వల్ల ఇద్దరు అంధులకు చూపును పరోక్షంగా ప్రసాదించినట్లు అవుతుందన్నారు. శరీరంతో పాటు కళ్లు కూడా మట్టిలో కలిసిపోకుండా నేత్రదానం చేయడం వల్ల అవి మరొకరికి చూపును అందిస్తాయని, ఇది ఎంతో పుణ్యకార్యమన్నారు. ఎవరైనా నేత్రదానానికి అంగీకరిస్తే 9966509374కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

Updated Date - 2023-05-25T23:01:49+05:30 IST