వెల్లటూరులో శిలాశాసనాలు వెలికితీత
ABN , First Publish Date - 2023-09-16T23:37:34+05:30 IST
వెల్లటూరు గ్రామంలోని ప్రాచీన శివాలయం సమీపం లో వైద్యానికి సంబంధించిన శిలాశాసనాన్ని వెలికితీశారు.
పెండ్లిమర్రి, సెప్టెంబరు 16: వెల్లటూరు గ్రామంలోని ప్రాచీన శివాలయం సమీపం లో వైద్యానికి సంబంధించిన శిలాశాసనాన్ని వెలికితీశారు. శనివారం నేషనల్ ఇనస్టిట్యూట్ ఆఫ్ ఇండియన మెడికల్ హెరిటేజ్, భార త ప్రభుత్వం సాహి ప్రాజెక్టులో భాగంగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జీపీ ప్రసాద్ సార ధ్యంలో లైబ్రేరియన శ్రీనివాసరావు, ఫొటో గ్రాఫర్ రవిబాబు, మధుసూదనరెడ్డిల బృం దం ఈ శాసనాన్ని వెలికితీసింది. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ పూర్వకాలంలో ఈ గ్రామం పశువైద్యానికి సంబంధించి ప్రసిద్ధి చెందినట్లు ఈ శాసనంలో పొందు పరిచినట్లు వారు తెలిపారు. ఈ శాసనాన్ని భావితరాలకోసం భద్రపరచాల్సిన ఆవశ్యకతను డాక్టర్ జీపీ ప్రసాద్ గ్రామస్తులకు తెలిపారు.