వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2023-09-17T23:56:06+05:30 IST

వినాయక చవితి వేడుకలకు మద నపల్టె పట్టణంతోపాటు మండలం సర్వం సిద్ధమైంది.

వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధం

మదనపల్లె అర్బన, సెప్టెంబరు17: వినాయక చవితి వేడుకలకు మద నపల్టె పట్టణంతోపాటు మండలం సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉద యం నుంచే పట్టణంలోకి పరిసర గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పట్టణం చేరుకుని పండుగకు కావాల్సిన సామగ్రిని కొను గోలు చేశారు. పట్టణంలోని ముఖ్యమైన సర్కిల్‌ ఎన్టీఆర్‌ సర్కిల్‌, మల్లికార్జున సర్కిల్‌, బెంగళూరు బస్టాండ్‌, టౌనబ్యాంకు సర్కిల్‌, నిమ్మనపల్లె సర్కిల్‌, చిత్తూరుబస్టాండ్‌ సర్కిల్‌లో జనంతో రద్దీగా కనిపించింది. ఆర్‌ఆర్‌ వీధి, నెహ్రుబజార్‌, సీటీఎం రోడ్డులో వస్త్రదుకా ణాల్లో పండుగ సందడి కనిపించింది. వినాయక విగ్రహాలను వాహ నాలల్లో తరలించడంతో ఒక్కసారీగా పట్టణంలోకి రావడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పండుగ వేడుకలతో పూలు, పండ్ల ధరలు ఆకా శాన్నంటాయి. ఇందులో చామంతి పూలు కేజీ రూ.340, బంతిపూ లు కేజీ వందరూపాయలు, చిట్టి రోజాలు కేజీ రూ.300, కనకాంబ రాలు కేజీ రూ.460 ధరలు పలికాయి, పండ్లు పండగ పురస్కరిం చుకొని డబుల్‌ రేట్లు వ్యాపారులు అమ్మేశారు. మొన్నటి వరకు కూడా బంతి పూలు రోడ్డులో పడేసిన సందర్భం అందరికి తెలిసిందే, కానీ వినాయక చవితి పండుగకు కొంచెం పూల రైతులకు ధరల కనిపిం చాయి. కొన్ని చోట్ల అరటిమానులతోపాటు, గెరిక, పచ్చిసీతాఫ లాలు, వెలక్కాయలు, మామిడి ఆకులు, జామకాయలు చిరువ్యాపా రులు అధిక సంఖ్యలో అమ్మకాలు నిర్వహించారు. పట్టణంలో పలు చోట్ల బండ్లపై వినాయక మట్టి ప్రతిమలను అమ్మకాలు చేశారు.

Updated Date - 2023-09-17T23:56:06+05:30 IST