ప్రతి రైతుకు గుర్తింపు అవసరం

ABN , First Publish Date - 2023-06-26T22:43:05+05:30 IST

ప్రతి రైతుకు గుర్తింపు అవసరమని, ప్రతి రైతూ తాను పండించే ఆహారం గొప్ప తనాన్ని తెలుసుకోవాలని సీబీఐ మా జీ జేడీ లక్ష్మినారాయణ సూచించారు.

ప్రతి రైతుకు గుర్తింపు అవసరం

పెద్దతిప్పసముద్రం జూన్‌ 26 : ప్రతి రైతుకు గుర్తింపు అవసరమని, ప్రతి రైతూ తాను పండించే ఆహారం గొప్ప తనాన్ని తెలుసుకోవాలని సీబీఐ మా జీ జేడీ లక్ష్మినారాయణ సూచించారు. బి.కొత్తకోట మండలంలోని బండారు వారిపల్లె పంచాయతీ పెద్దపల్లె గ్రామంలోని కార్తికేయ ఫాంహౌస్‌లో సోమవారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కరోనా తో ప్రపంచమంతా ఆగినా రైతు మాత్రమే అహర్నిశలు శ్రమించాడన్నారు. తొలకరి వర్షాలు ప్రయోజనాలను వివరించారు. ఆదర్శ రైతు శ్రీకాంత్‌ రెడ్డి, మొలకల చెరువు కు చెందిన సహదేవరెడి, కాలువపల్లెకు చెందిన చంద్రరెడ్డి, బి.కొత్తకోటకు చెందిన రఘునాథరెడ్డి, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-06-26T22:43:05+05:30 IST