పర్యావరణ పరిరక్షణ సంరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2023-06-02T23:02:07+05:30 IST

పర్యావరణ పరిరక్షణ సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా విద్యుత్‌శాఖ అధికారి రమణ అన్నారు.

పర్యావరణ పరిరక్షణ సంరక్షణ అందరి బాధ్యత

జిల్లా విద్యుత్‌శాఖ అధికారి రమణ

కడప (ఎర్రముక్కపల్లె), జూన్‌ 2: పర్యావరణ పరిరక్షణ సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా విద్యుత్‌శాఖ అధికారి రమణ అన్నారు. శుక్రవారం కడప నగరం విద్యుత్‌ భవన్‌ కార్యాలయంలో పర్యావరణ రక్షణపై భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్‌ లైఫ్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించిన ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ ఆదా చేసేందుకు ఎల్‌ఈడీ బల్బులు వాడకం ఎంతో మంచిదన్నారు. ఎయిర్‌ కండీషన్ల ఉష్ణోగ్రతను 24డిగ్రీలు ఉంచాలని సూచించారు. నీటిని కుండల్లో నిల్వ ఉంచుకుని వాడడం శ్రేష్టమన్నారు.

తరచూ వాడే ఎలక్ర్టానిక్‌ వస్తువులకు స్మార్ట్‌స్విచ్‌లను ఏర్పాటు చేసుకోవాలని, గీజర్ల స్థానంలో సోలార్‌ హీటర్లను వాడుకోవాలని సూచించారు. బట్టలు ఆరబెట్టేందుకు డ్రయర్లకు బదులు సూర్యశక్తిని వాడుకుంటే మంచిదని చెప్పారు. పగటిపూట లైట్లు, ఫ్యాన్లకు బదులు సహజ గాలి వెలుతురును వాడుకోవడం ఎంతో మంచిదని సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రజారవాణా ను ఉపయోగించి ఇందన ఖర్చు తగ్గించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు నరసింహ ప్రసాద్‌, సోమా శ్రీనివాసులు, సీనియర్‌ అకౌంటు అఽధికారి మధుకుమార్‌, అకౌంటు ఆఫీసర్‌ మల్లికార్జున, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:02:07+05:30 IST