లక్ష్య సాధనకు కృషి చేయాలి
ABN , First Publish Date - 2023-04-25T23:07:21+05:30 IST
రాష్ట్ర ప్రభుత్యం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల లక్ష్య సాధనకు అధికారులందరూ అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ పీఎస్ గిరీషా అధికారులను అదేశించారు.
జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి
కలెక్టర్ పీఎస్ గిరీషా
రాయచోటి (కలెక్టరేట్), ఏప్రిల్ 25: రాష్ట్ర ప్రభుత్యం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల లక్ష్య సాధనకు అధికారులందరూ అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ పీఎస్ గిరీషా అధికారులను అదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్‌లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పఽథకాలు ప్రజలకు అందించడమే ప్రభుత్యం ముఖ్య లక్ష్యమన్నారు. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు అంకితభావంతో పనిచేస్తే లక్ష్యాలను వందశాతం సాధించవచ్చని తెలిపారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్యాలన్నదే ప్రభుత్యం లక్ష్యమని దీనికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలని తెలిపారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు ఈకేవైసీని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు అన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అదేశించారు. రీసర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా చేయాలని, గ్రామ వార్డు సచివాలయాల్లో అందిస్తున్న సేవలు మరింతగా ప్రజలకు చేరువ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్‌వో సత్యనారాయణ, ఏవో బాలక్రిష్ణ, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.