పండ్ల తోటలతో ఆర్థికాభివృద్ధి

ABN , First Publish Date - 2023-05-25T23:52:02+05:30 IST

పండ్ల తోటలతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని పెద్దమండ్యం ఎంపీడీవో శ్రీధర్‌రావు, ఏపీవో మురళి పేర్కొన్నారు.

పండ్ల తోటలతో ఆర్థికాభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో శ్రీధర్‌రావు

పెద్దమండ్యం, మే 25: పండ్ల తోటలతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని పెద్దమండ్యం ఎంపీడీవో శ్రీధర్‌రావు, ఏపీవో మురళి పేర్కొన్నారు. పెద్దమం డ్యం ఎంపీడీవో కార్యాలయం లో గురువారం ఉపాధి హామీ పథకం, స్వయం సహాయక మ హిళా సంఘాలు, ఉద్వావన శాఖ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పండ్ల తోటలు సాగు కోసం ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు చేస్తామన్నారు. 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులు పండ్ల తోటలు సాగుచేయవచ్చ న్నారు. మామిడి, జీడీ మామిడి, బత్తాయి, నాటుజామ, సపోటా, సీతాఫలం, దానిమ్మ, నేరేడు తదితర పండ్ల తోటలు సాగుకు ఉపాధి నిధులు మంజూరు చేస్తామన్నారు. పండ్ల తోటలు ఆర్థికాభివృద్ధి సాధ నపై మూడు శాఖల అధికార సిబ్బంది రైతులకు అవగాహన కల్పిం చాలన్నారు. ఆసక్తి ఉన్న అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నా రు. వెలుగు సీసీ, ఉపాధి, ఉద్వానశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T23:52:02+05:30 IST