వాతావరణ మార్పులపై అవగాహనకు ఎర్త్‌ హవర్‌ డే

ABN , First Publish Date - 2023-03-25T22:07:15+05:30 IST

వాతావరణం లో జరిగే మార్పులు, ఎనర్జీ (శక్తి) పరివర్తనపై అందరిలోనూ అవగా హన కల్పించేందుకే ఎర్త్‌ హవర్‌ డేను నిర్వహిస్తున్నట్లు ప్రధానో పాఽ ద్యాయుడు బీ. రెడ్డెన్న తెలిపారు.

వాతావరణ మార్పులపై అవగాహనకు ఎర్త్‌ హవర్‌ డే
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయుడు రెడ్డెన్న

గాలివీడు, మార్చి 25: వాతావరణం లో జరిగే మార్పులు, ఎనర్జీ (శక్తి) పరివర్తనపై అందరిలోనూ అవగా హన కల్పించేందుకే ఎర్త్‌ హవర్‌ డేను నిర్వహిస్తున్నట్లు ప్రధానో పాఽ ద్యాయుడు బీ. రెడ్డెన్న తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత బాలుర ఉన్నత పాఠ శాలలో ఎన్జీసీ ఆధ్వర్యంలో ఎర్త్‌ హవర్‌, గ్లోబర్‌ వార్మింగ్‌ మధ్య సంబంధాన్ని విద్యార్థులకు తెలియ జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్త్‌ హవర్‌ అనేది వ రల్డ్‌ వైల్డ్‌ లైవ్‌ ఫండ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తు ప్రపంచ వ్యాప్త ఉద్యమం అన్నారు. ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం రాత్రి ఒక గంట పాటు విద్యుత దీపాలను ఆర్పివేసేలా ప్రోత్సహిం చడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఇలా చేయడం వల్ల ఒక గంట సమయం విద్యుత తయారీకి వినియోగించే వనరులు ఆదా అవుతాయన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకుంటేనే భవిష్యత తరాల కు అందించగలుగుతామన్నారు.

Updated Date - 2023-03-25T22:07:15+05:30 IST