సీపీఐ నేతల ముందస్తు అరెస్టులు దారుణం

ABN , First Publish Date - 2023-03-19T23:36:25+05:30 IST

రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబరు 1ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ 20వ తేదీ (సోమవారం) సీపీఐ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా పార్టీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు సాంబశివ పేర్కొన్నారు.

సీపీఐ నేతల ముందస్తు అరెస్టులు దారుణం

మదనపల్లె అర్బన, మార్చి19: రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబరు 1ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ 20వ తేదీ (సోమవారం) సీపీఐ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా పార్టీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు సాంబశివ పేర్కొన్నారు. ప్రజా, కార్మికసంఘాల సమస్యలపై రోడ్డుపై నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించ రాదని రాష్ట్రప్రభుత్వం జీవో నెం.1 తీసుకొచ్చి ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. నిరసనలు తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ప్రజల హక్కుల ను కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో విద్యావేత్తలు రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్నారు. ఇప్పటికైనా సీఎం జగన మొండి వైఖరి విడనాడి ప్రజల హక్కులను కాపాడాలన్నారు.

కలకడలో:రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చీకటి జీవో నెంబరు 1ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నకుండా పోలీ సులు ముందస్తు నోటీసులు ఇచ్చి అరెస్టు చేయడం దారుణమని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి వెంకటేష్‌ అన్నారు. తాను స్వగ్రామంలోని పొలం వద్ద ఉండగా కేవీపల్లె పోలీ సులు నిర్భందంలోకి తీసుకొని కలకడ పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ప్రజా ఉద్యమాలను అణగదొక్కే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవా లని హితవుపలికారు.

Updated Date - 2023-03-19T23:36:25+05:30 IST