రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో దువ్వూరు క్రీడాకారిణి ప్రతిభ

ABN , First Publish Date - 2023-09-25T23:22:13+05:30 IST

మండల పరిధిలోని గుడిపాడు గ్రామానికి చెందిన వరికూటి వెంకట కవిత అనే క్రీడాకారిణి రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరచి బంగారు పతకాన్ని సాధించింది.

రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో దువ్వూరు క్రీడాకారిణి ప్రతిభ
బంగారు పతకాన్ని అందుకుంటున్న కవిత

దువ్వూరు, సెప్టెంబరు 25: మండల పరిధిలోని గుడిపాడు గ్రామానికి చెందిన వరికూటి వెంకట కవిత అనే క్రీడాకారిణి రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరచి బంగారు పతకాన్ని సాధించింది. ఈనెల 23, 24 తేదీల్లో విశాఖపట్నం చంద్రయాన్‌పాళెం జడ్జీహెచ్‌ఎ్‌సలో జరిగిన రాష్ట్రస్థాయి గ్రాప్లింగ్‌, రెజ్లింగ్‌ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన బాలబాలికలు పాల్గొన్నారు. జూనియర్‌ విభాగంలో 53 కేజీల పోటీల్లో మొదటిస్థానంలో నిలిచి రెండు గోల్డ్‌మెడల్స్‌ను, ప్రశంసాపత్రాన్ని అందుకుం ది. వెంకటశ్రీనివాసులరెడ్డి, వెంకటసుబ్బమ్మల కుమార్తె అయిన వెంకట కవిత ప్రభు త్వ ప్రోత్సాహకం లేకున్నా...అమ్మానాన్నల ప్రోత్సాహంతో క్రీడారంగంలో రాణించడంపట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-25T23:22:13+05:30 IST