పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

ABN , First Publish Date - 2023-01-25T23:58:01+05:30 IST

చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్‌ను కడప డీఎ స్పీ వెంకటశివారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

సీకేదిన్నె, జనవరి 25: చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్‌ను కడప డీఎ స్పీ వెంకటశివారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ కేసులను పరిష్కరించాలని ఎస్‌ఐని ఆదేశించారు. అలాగే స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి సీజ్‌ చేసిన వాహనాల వివరాలు తెలుసుకున్నారు. స్టేషన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు విధి నిర్వహణలో ముందుండాలన్నారు. కార్యక్రమంలో సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:58:01+05:30 IST