ఆ హెడ్మాస్టర్‌ మాకొద్దు

ABN , First Publish Date - 2023-06-02T23:16:52+05:30 IST

వివాదా స్పద హెడ్మాస్టర్‌ను నియమిం చొద్దంటూ శుక్రవారం పెద్దూరు గ్రామస్తులు ఆందోళన చేశారు.

ఆ హెడ్మాస్టర్‌ మాకొద్దు
గాలివీడులోని ఉర్దూ హైస్కూల్‌ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

పాఠశాల ముందు గ్రామస్తుల నిరసన

గాలివీడు, జూన్‌ 2: వివాదా స్పద హెడ్మాస్టర్‌ను నియమిం చొద్దంటూ శుక్రవారం పెద్దూరు గ్రామస్తులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే... గాలివీడు మండల కేంద్రం పెద్దూరులోని స్థానిక ఉర్దూ హైస్కూల్‌కు పెనగలూరు మండలం ఎన్‌ ఆర్‌పురం జెడ్పీహెచ్‌ఎస్‌ హెడ్మా స్టర్‌ కృష్ణానాయక్‌ను ప్రధానో పాధ్యాయుడుగా నియమించిన ట్లు తెలియడంతో వారు ఆందోళనకు పూనుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఈయన విధులు నిర్వహించిన చోట విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పట్టుబడ్డాడన్నారు. ఇలాంటి దుష్ప్రవర్తన కలిగి న వ్యక్తిని హెడ్మాస్టర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని గాలివీడు-1 ఎంపీ టీసీ సభ్యురాలు తాజున్నీషా, మాజీ సర్పంచ్‌ రియాజ్‌ విద్యాశాఖ అధికారులను డిమాండ్‌ చేశా రు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఉర్దూ పాఠశాలలో ఎంతో మంది హెడ్మాస్టర్లుగా విధులు నిర్వహించినప్పటికీ ఆక్షేపించలేదన్నారు. కానీ తమ గ్రామంలోని ఆడబిడ్డల చదువుతో పాటు, వారి రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ హెడ్మాస ్టర్‌ నియామకాన్ని అడ్డుకుంటున్నామని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్టామని స్పష్టం చేశారు.

Updated Date - 2023-06-02T23:16:52+05:30 IST