జాతీయ స్థాయి చెస్ పోటీలలో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు
ABN , First Publish Date - 2023-09-25T23:24:53+05:30 IST
జాతీయ స్థాయి చెస్ పోటీలలో జిల్లా క్రీడాకారులు సత్తా చాటి విజేతలుగా నిలిచినట్లు జిల్లా చెస్ అసోసియేషన కార్యదర్శి అనీస్ దర్బారి తెలిపారు.

కడప (స్పోర్ట్స్), సెప్టెంబర్ 25: జాతీయ స్థాయి చెస్ పోటీలలో జిల్లా క్రీడాకారులు సత్తా చాటి విజేతలుగా నిలిచినట్లు జిల్లా చెస్ అసోసియేషన కార్యదర్శి అనీస్ దర్బారి తెలిపారు. నెల్లూరు నగరంలో ఈనెల 24న వైవీ రమణారెడ్డి మెమోరియల్ ఇండియా లెవల్ ఓపెన ఫ్రైజ్ మనీ చెస్ టోర్నమెంట్‌లో వివిధ రాషా్ట్రల నుంచి సుమారు 341 మంది చదరంగం క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో అంతర్జాతీయ మాస్టర్లు, రేటెడ్ క్రీడాకారులు కూడా వున్నారన్నారు. ప్రొద్దుటూరుకు చెందిన రేటెడ్ క్రీడాకారిణి సజోత్సన్న అండర్-13 బాలికల విభాగంలో ప్రథమ విజేతగా నిలువగా, కడపకు చెందిన జ్యోతి స్పందన ద్వితీయ విజేతగా నిలిచింది. వీరితో పాటు అండర్-11 బాలికల విభాగంలో కడపకు చెందిన చిన్మయి ద్వితీయ విజేతగా, బాలుర విభాగంలో కడపకు చెందిన ప్రదీ్‌ప్‌చంద్రారెడ్డి నాల్గవ స్థానంలో నిలిచారు. అండర్-7 బాలికల విభాగంలో కడపకు చెందిన చిన్నారి అమీనా నాల్గవ స్థానం పొందినట్లు వెల్లడించారు. వీరు కలకత్తాకు చెందిన అంతర్జాతీయ చెస్ మాస్టర్ అతానులహరి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నట్లు వెల్లడించారు.