ఉత్సాహంగా జిల్లాస్థాయి బ్యాడ్మింటన పోటీలు

ABN , First Publish Date - 2023-06-26T23:47:40+05:30 IST

జిల్లాస్థాయి అండర్‌ 11, 13 సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన పోటీలు జార్జికారొనేషన క్లబ్‌లో ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు.

ఉత్సాహంగా జిల్లాస్థాయి బ్యాడ్మింటన పోటీలు
బ్యాడ్మింటన పోటీల్లో విజయం సాధించిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన, జూన 26: జిల్లాస్థాయి అండర్‌ 11, 13 సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన పోటీలు జార్జికారొనేషన క్లబ్‌లో ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన అసోసియేషన జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ సింగం భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు నిత్యం సాధన చేసి నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. జ్రార్జిక్లబ్‌ కార్యదర్శి గంగిరెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభకనబరచాలన్నారు. అనంతరం పోటీల్లో విజేతలైన వారికి మెమెంటోలు, సర్టిఫికెట్లు అందించారు. అండర్‌ -13 బాలుర విభాగంలో మహ్మద్‌ అదిల్‌, బాలికల విభాగంలో పూర్వజ, అండర్‌-11 బాలుర విభాగంలో విశాల్‌ రెడ్డి, బాలికల విభాగంలో కుజుమకానంలు ఛాంపియన్లుగా నిలిచారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన అసోసియేషన కార్యదర్శి శ్రీనివాసులు, చైర్మన జిలానీ బాషా, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నాగరాజు, కోచ సుదర్శన, అనిల్‌, సోని, శామ్యూల్‌, రామయ్య, జాకీర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:47:40+05:30 IST