నరసింహస్వామికి వెండి వస్తువులు వితరణ
ABN , First Publish Date - 2023-09-22T23:41:10+05:30 IST
గుర్రంకొండ మండలం తరిగొండలో కొలువైన లక్ష్మీనర సింహస్వామి వారికి దాతలు రూ.లక్ష విలువ గల వెండి వస్తువులను వితరణగా అంద జేశారు.
గుర్రంకొండ, సెప్టెంబరు 22:గుర్రంకొండ మండలం తరిగొండలో కొలువైన లక్ష్మీనర సింహస్వామి వారికి దాతలు రూ.లక్ష విలువ గల వెండి వస్తువులను వితరణగా అంద జేశారు. ఇందులో భాగంగా స్వామివారి సేవకు వినియోగించే వెండి గంట, బంగారపూతతో చేసిన వెండి యజ్ఞోపవీతంను మదన పల్లెకు చెందిన దాత యుగంధర్ వితరణగా ఆలయాధికారి కృష్ణమూర్తి కి అందజేశారు. దాతలకు స్వామి దర్శనభాగ్యం కల్పించి తీర్థప్రసా దాలను అందజేశారు. అర్చకులు సిబ్బంది నాగరాజ పాల్గొన్నారు.