అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-08-22T23:19:06+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబరు 1వ తేదీన పులివెందుల పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశించారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్‌
పులివెందులలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు

పులివెందుల టౌన్‌, ఆగస్టు 22: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబరు 1వ తేదీన పులివెందుల పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశించారు. మంగళవారం పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి బాక్రాపురంలోని హెలిప్యాడ్‌, శ్రీకృష్ణాలయం, శిల్పారామం అభివృద్ధి పనులు, ఏపీకార్ల్‌లో స్వామినారాయణ గురుకుల విద్యాపీఠం పనులను ఆయన పరిశీలించారు. అలాగే స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మోడల్‌ టౌన్‌లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మోడల్‌ టౌన్‌లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌, వైస్‌ చైర్మన్‌ హఫీజ్‌, ఆర్డీఓ వెంకటేశులు, తహసీల్దార్‌ మాధవకృష్ణారెడ్డి, కమిషనర్‌ నరసింహారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T23:19:06+05:30 IST