రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యం : దొమ్మలపాటి
ABN , First Publish Date - 2023-06-11T23:49:20+05:30 IST
రాష్ట్రాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మద నపల్లె నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు.
రామసముద్రం, జూన 11: రాష్ట్రాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మద నపల్లె నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు భవిష్యత గ్యారెంటీ పేరిట ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోలోని అంశాల ను ప్రజలలోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భా గంగా ఆదివారం ఆయన మండలానికి విచ్చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ మహిళ, రైతు, యువత, వెనుకబడిన తర గతుల సాధికారత బలోపేతంతో పాటు ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తొలి ఎజెండా భవిష్యత గ్యారెంటీ చారిత్రాత్మకమైనదని కొనియాడారు. ఈమ్యానిఫెస్టోలోని అంశాలతో వైసీపీ నాయకులకు భయం పట్టు కుందన్నారు. పార్టీ కార్యకర్తలు, గ్రామ, మండల కమిటీ అధ్యక్షుడు, క్లస్టర్ ఇనచార్జిలు అందరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ అఽధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడు, యశస్విరాజ్, చిన్నుస్వామి, కరీముల్లా, బాబా, ఎల్.శివ, మేస్త్రీ రామచంద్రప్ప, ప్రతీప్‌రెడ్డి, అల్తాఫ్, బంగారప్ప పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై దాడులు పెరిగాయి
టీడీపీ పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్
కురబలకోట, జూన 11: వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు హెచ్చు మీరాయని రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్ ధ్వజమె త్తారు. ఆదివారం మండలంలోని అంగళ్ళులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ బీసీలపై జరిగిన దాడులను నిరసిస్తూ బీసీ విబాగం-పోరుబాట కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కులాల వారీగా వారం రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆరోపిం చారు. రాబోవు ఎన్నికల్లో బీసీలు ఏకమై వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతార న్నారు. కాగా 12న పాల ఏకరి, యాదవ, వడ్డెర, ఈడిగ, గౌడ 13న నాయీబ్రాహ్మణ, కృష్ణబలిజ, పూసల, సాగర, ఉప్పర, మొదలియార్, 14న విశ్వబ్రాహ్మణ, గాండ్ల, తెలి కుల, దూదేకుల, వాల్మీకి, 15న రజక, కురబ, కురమ, మేదరి, వీరశైవల్, లింగాయత, లింగ బలిజ, 16న శాలివాహన, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, తొగట, బెస్త, మత్స్యకారులు, 17న ముదిరాజ్, దాసరి, జంగం, కొప్పుల వెలమ, భట్రారాజులు, పెరికలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీలు పాల్గొని విజవంతం చేయాలని కోరారు.