బీజేపీని గద్దె దింపండి.. దేశాన్ని కాపాడండి
ABN , First Publish Date - 2023-04-16T23:29:18+05:30 IST
కేంద్రంలో బీజేపీని గద్దె దించి దేశాన్ని కాపాడాలని రాష్ట్ర సీపీఐ నేత గుజ్జుల ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి నరసింహులు, సీఐటీయూ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సీహెచ చంద్రశేఖర్ తెలిపారు.
ప్రచారభేరిలో వామపక్ష నాయకులు
రైల్వేకోడూరు, ఏప్రిల్ 16: కేంద్రంలో బీజేపీని గద్దె దించి దేశాన్ని కాపాడాలని రాష్ట్ర సీపీఐ నేత గుజ్జుల ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి నరసింహులు, సీఐటీయూ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సీహెచ చంద్రశేఖర్ తెలిపారు. ప్రచార భేరిలో భాగంగా ఆదివారం రైల్వేకోడూరు లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభు త్వం ప్రజా సమస్యలు పరిష్కరించకుండా, పెట్టుబడిదారులకు అను కూలంగా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ అధికారం లోకి వచ్చిన తర్వాత గ్యాస్ ధర రూ. 1200 అయిందన్నారు. నిత్యావసర సరుకులు విపరీతంగా పెంచేశారన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు పరం చేశారన్నా రు. మన దేశ సంపద ను ఆదాని, అంబానీలకు కట్టబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం బీజేపీ చెప్పుచేతల్లో నడుస్తోం దన్నారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను, కరెంటు చార్జీలు పేరిట ప్రజలపై భారం మోపుతున్నా రన్నారు. టీడీపీ, జనసేన వంటి పార్టీలు బీజేపీ విధానాలను వ్యతిరేకించకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాబోవు ఎన్నికల్లో బీజేపీ భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు పండుగోల మణి, కోడూరు ఏరియా సీపీఐ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, సీపీఐ, సీపీఎం నాయకులు సిగే చెన్నయ్య, రాజశేఖర్, గంగాపూరి సుధాకర్, ప్రసాద్, సోమా గంగయ్య, కేశం ప్రసాద్, శివయ్య, ఆదినారాయణ, నాగమ్మ, హరినారాయణ, శివయ్య, నాగిపోగు పెంచలయ్య, మౌలాలిబాషా, మోడీ సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు.