ప్రజాస్వామ్యం గెలిచింది
ABN , First Publish Date - 2023-03-18T23:34:12+05:30 IST
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థు ల విజయంతో ప్రజాస్వామ్యం గెలిచినట్లైందని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌రెడ్డి
రాయచోటిటౌన్, మార్చి 18: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థు ల విజయంతో ప్రజాస్వామ్యం గెలిచినట్లైందని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మా ట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన డానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. ఈ ఎన్నికలతో ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో ఉన్న వ్యతిరేకత బయటపడిందన్నారు. ఎలాగైనా గె లుపొందాలనే లక్ష్యంతో వ్యవస్థలన్నిటినీ గుప్పి ట్లో ఉంచుకుని డబ్బు, దొంగ ఓట్లతో ఎన్ని కుట్రలు పన్నినా చివరకు విద్యావంతులు టీడీ పీ అభ్యర్థులను గెలిపించారన్నారు. నాలుగేళ్లు గా జగన్ నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉ న్నాడని ఆరోపించారు. ఎంతో ఆశతో గద్దెనెక్కిం చిన ప్రభుత్వం ఉపాధి కల్పనలో విఫలం కావ డంతో, చంద్రబాబు వస్తేనే యువతకు ఉపా ధి, ఉద్యోగాలు వస్తాయనే గట్టి నమ్మకంతో ఈ విజయం అందించారన్నారు. ఈ ఎన్నికలు సెమీ ఫైనల్ అన్న వైసీపీ నాయకులకు ప్రస్తు త ఫలితాలు చెంపపెట్టు లాంటివని, రానున్న 2024 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు.
వైసీపీ పాలనకు అంతిమ ఘడియలు
రాయచోటిటౌన్: వైసీపీ పరిపాలన అంతానికి ఘడియలు దగ్గరపడ్డాయని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా అన్నారు. శనివారం రాయచోటిలోని టీడీపీ కార్యాల యం లో విలేకరుల సమావేశంలో మాటా ్లడారు. 108 నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరం చూశామన్నారు. జగన్ ప్రభుత్వంపై విద్యావంతులకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థ మైందని, ప్రజల గొంతు నొక్కేస్తే.. రాష్ర్టాన్ని అధోగతి పాలు చేస్తే.. ఇలాంటి తీర్పే వస్తుం దన్నారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నరసారెడ్డి, సంబేపల్లె క్లస్టర్ ఇన్‌చార్జి విష్ణువర్ధన్‌రెడ్డి, సంబేపల్లె మండల అధ్యక్షుడు రెడ్డెయ్యయాదవ్, రాజంపేట పార్లమెంటరీ కార్యదర్శి కూనాసి సుబ్బరాజుయాదవ్, రౌతుకుంట టీడీపీ నాయకులు ఖాదర్‌బాషా, నూరెకరాల రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి
లక్కిరెడ్డిపల్లె: ఎమ్మెల్సీ ఎన్నికలతో వైసీపీ ప్ర భుత్వానికి నూకలు చెల్లాయని లక్కిరెడ్డిపల్లె మండల క్లస్టర్ ఇన్‌చార్జి మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ కాలడి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆర్ ఆర్ స్వగృహంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సర్పంచు నాగేంద్ర, ముక్తార్ అహ్మద్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గంగయ్య, నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
పులివెందుల నుంచే టీడీపీ ప్రస్థానం
నందలూరు : అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రస్థానం పులివెందుల నుంచి మొదలవు తుందని ఎమ్మెల్సీ ఎన్నికలలో భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విజయమే దీనికి సంకేతం అని రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దల విజయసాగర్, తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ అన్నారు. శనివారం మండ లంలోని అన్నమాచార్య అకాడమీ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. మండల టీడీపీ నాయకులు మాడపూరి హేమ లత, తోట శివశంకర్, తాటి సుబ్బరాయుడు, కొండిశెట్టి సుదర్శన్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.