భక్తిశ్రద్ధలతో అయ్యప్పస్వామి జ్యోతిదర్శనం

ABN , First Publish Date - 2023-01-15T00:09:06+05:30 IST

మకరసంక్రాంతి సందర్భంగా చిప్పిలి గ్రామంలోని బాలఅయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో భక్తులు అయ్యప్పస్వామి జ్యోతిదర్శనం చేసుకున్నారు.

భక్తిశ్రద్ధలతో అయ్యప్పస్వామి జ్యోతిదర్శనం
మదనపల్లెలో నగలపెట్టెను ఊరేగింపు నిర్వహిస్తున్న భక్తులు

మదనపల్లె, అర్బన, జనవరి 14: మకరసంక్రాంతి సందర్భంగా చిప్పిలి గ్రామంలోని బాలఅయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో భక్తులు అయ్యప్పస్వామి జ్యోతిదర్శనం చేసుకున్నారు. ఆలయ ఆవరణంలో ఆలయకమిటీ అధ్యక్షుడు సి. రెడ్డెప్పరెడ్డి ఆధ్వర్యం లో ఉదయం గణపతి పూజ, అయ్యప్పమాలదారులు స్వామి నగల పెట్టెను ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం అధికసంఖ్యలో భక్తులు ఆలయం చేరుకుని బసినికొండపైన అయ్యప్పస్వామి జ్యోతిదర్శనం చేసుకున్నారు. ఆలయంలో భక్తులకు దాతలు బందార్ల వేణుగోపాల్‌ కుటుంబసభ్యులు విజయలక్ష్మీ, హర్షవర్థన, చైతన్యకుమార్‌, సాయి దర్గా షే, కేదారాయల్‌ కలిసి అన్నదానం చేశారు. మహిళలు ఆలయంలోని గోమాతకు పూజలు చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ సభ్యులు బ్యాంకు రమణ, విద్యోదయ శ్రీనివాసులు, అంజన్నమప్ప, మిట్స్‌ రవికుమార్‌ గంగిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో: వాల్మీకిపురం పట్టణంలోని కోనేటివీధిలో వెలసిన అయ్యప్పస్వామి దేవాలయంలో శనివారం మకరజ్యోతి దర్శన వేడుక లను వైభవంగా నిర్వహించారు. ఉదయం అయ్యప్పస్వాముల మూల విగ్రహానికి అభిషేకం, అర్చన, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సంద ర్భంగా ఆలయంలో భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్ర మాలు చేపట్టారు. కార్యక్రమాలలో గురుస్వాములు రామచంద్ర, సత్య పాల్‌రెడ్డి, బలరామ్‌, శ్రీరాములు, శ్రీనివాసులురెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

కలికిరిలో: పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం మకర జ్యోతి దర్శనం వైభవంగా నిర్వహించారు. అయ్యప్పస్వామికి ప్రీతిపా త్రమైన కర్పూరంతో జ్యోతి దర్శనం ఏర్పాటు చేశారు. రంగు రంగుల విద్యుద్దీపాలతో ఆలయాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. సరిగ్గా ఉత్తరాయణ మూహూర్త ఆరంభం సమయంలో జ్యోతి వెలిగించారు. పాల్గొన్న భక్తులంతా ఆలయం ప్రాంగణంలో జ్యోతులు వెలిగించారు. అయ్యప్ప భక్తులందరికీ నిర్వాహకులు అన్నప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2023-01-15T00:10:46+05:30 IST