ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం
ABN , First Publish Date - 2023-02-25T23:26:33+05:30 IST
మోడంపల్లెలో శనివారం రాత్రి ఓంశాంతి ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం ప్రారంభమైంది.
ప్రొద్దుటూరు టౌన్, ఫిబ్రవరి 25 : మోడంపల్లెలో శనివారం రాత్రి ఓంశాంతి ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం ప్రారంభమైంది. మహా రాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లోని జ్యోతిర్లింగాలను భక్తుల దర్శనార్థం ఇక్కడ ఏర్పాటు చేశారు. 30 అడుగుల వాయులింగం సెట్టింగ్, చిన్నారుల అష్టలక్ష్మిల అలంకరణ, నటరాజ కళాక్షేత్రం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 28వ తేదీ వరకు ఉదయం ప్రతి రోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు జ్యోతిర్లింగాల దర్శనం, సాయంత్రం 6 నుంచి 8 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని ఓంశాంతిలు తెలిపారు. కార్యక్రమంలో రమణి బెహన్‌జీ, చంద్రశేఖర్, విశ్వనాథ్‌భాయ్, రవి భాయ్, మోక్షగుండం ఓంశాంతి భవన్ నిర్వాహకురాలు పావని బెహన్‌జీ, భక్తులు పాల్గొన్నారు.