130 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం

ABN , First Publish Date - 2023-03-18T23:25:14+05:30 IST

మదనపల్లె నియో జకవర్గంలో రెండు రోజుల పాటు కురిసిన గాలి వానకు 130 ఎకరాల్లో ఉద్యానపంటలకు నష్టం వాటిల్లిందని ఉద్యానశాఖ అధికారి ఈశ్వరప్రసాద రెడ్డి పేర్కొన్నారు.

 130 ఎకరాల్లో  ఉద్యాన పంటలకు నష్టం
దెబ్బతిన్న టమోట పంటను పరిశీలిస్తున్న ఉద్యాన అధికారి

మదనపల్లె టౌన, మార్చి 18: మదనపల్లె నియో జకవర్గంలో రెండు రోజుల పాటు కురిసిన గాలి వానకు 130 ఎకరాల్లో ఉద్యానపంటలకు నష్టం వాటిల్లిందని ఉద్యానశాఖ అధికారి ఈశ్వరప్రసాద రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండంలోని కోట వారుపల్లె, గంగన్నగారిపల్లెలో వర్షం దెబ్బకు నష్టపోయిన రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా 110 ఎకరాల్లో టమోటా, 6 ఎకరాల్లో బొప్పాయి, 3 ఎకరాల్లో మామిడి, 3 ఎకరాల్లో అలనేరెడు తోటలకు నష్టం వాటిల్లిందన్నారు. వడగళ్ల వానకు నష్టపోయిన ప్రతి రైతు వివరాలు ఆర్‌బీకే సిబ్బంది క్షేత్రస్థాయి వెళ్లి పరిశీలిస్తారన్నారు. మండల వ్యవసాయ సలహాదారుల కమిటీ చైర్మన కత్తి రాజా మాట్లాడుతూ రైతులు నష్టపోయిన పంట వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

నిమ్మనపల్లెలో: మండలంలో వీచిన గాలివా నకు ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో శనివారం ఉద్యాన శాఖ అధికారి ఈశ్వ ర్‌ రెడ్డి రాచివేటివారిపల్లె, వెంగంవారిపల్లెలో పర్య టించి పంట నష్టపోయిన రైతుల పొలాల వద్దకు వెళ్లి నష్టం అంచనా వేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 102 ఎకరాలలో టమోటా పంట, 10 ఎకరాలలో బొప్పాయి, 17ఎకరాలలో మామిడి తోటను 2ఎకరాల్లో మిరపతోట, 3ఎకరాలలో బెండతోటలు, దోస, ఖర్బూజా, అల్లనేరేడు పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు ఆయన తెలిపారు. అలాగే పంట నష్టంపై అన్ని గ్రామాల్లో తిరిగి అంచనా వేసి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిచనున్నట్లు తెలిపారు.

ములకలచెరువులో: మండలంలోని పలు గ్రామాల్లో గురు, శుక్రవారాల్లో వరుసగా రెండు రోజుల పాటు గాలివాన బీభత్సం సృష్టించాయి. దీంతో సాగుతో ఉన్న దోస, టమోటా తోటల్లోకి వర్షపు నీరు చేరాయి. దేవళచెరువు వద్ద దోస పంటలో భారీగా వర్షపు నీరు చేరగా మామిడి తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. ములకలచెరు వులో గురువారం 15 మిల్లీమీటర్లు, శుక్రవారం 10 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని రెవెన్యూ సిబ్బంది తెలిపారు.

Updated Date - 2023-03-18T23:25:14+05:30 IST