మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ

ABN , First Publish Date - 2023-07-16T23:25:23+05:30 IST

మొక్కల పెంపకం పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునిస్తుం దని కడప ఆర్టీసీ ఈడీ వెంక టేశ్వరరావు పేర్కొన్నారు.

మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ
ఆర్టీసీ ఆవరణలో మొక్కలు నాటుతున్న కడప ఈడీ వెంకటేశ్వరరావు

కడప ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వరరావు

మదనపల్లె అర్బన, జూలై 16: మొక్కల పెంపకం పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునిస్తుం దని కడప ఆర్టీసీ ఈడీ వెంక టేశ్వరరావు పేర్కొన్నారు. మద నపల్లె ఆర్టీసీ బస్టాండు ఆవర ణలో పచ్చదనం పెంపొందించ డం కోసం ఆదివారం కడప ఈడీ వెంకటేశ్వరరావు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్టీసీ వన, టూ డిపో మేనేజర్లు మూరె వెంకటరమనారెడ్డి, నిరంజన ఆధ్వ ర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం నివారించడంతోపాటు మానవజీవనం సజావుగా సాగడానికి వృక్షసంపద ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో మొక్కల పెంపకంతో కాల్యుషం తగ్గుతుందన్నా రు. కారక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్లు రేవతి, గీతా, గ్యారేజ్‌ సూపర్‌వైజర్లు, ఆర్టీసీ సూపర్‌వైజర్లు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-16T23:25:23+05:30 IST