Share News

యువగళం సభను జయప్రదం చేయండి

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:47 PM

విజయనగరం జిల్లా పోలిపల్లెలో ఈ నెల 20వతేదీన జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.

యువగళం సభను జయప్రదం చేయండి

ములకలచెరువు, డిసెంబరు 18: విజయనగరం జిల్లా పోలిపల్లెలో ఈ నెల 20వతేదీన జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ములకల చెరువులో బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గుతి ్తకొండ త్యాగరాజు, మాజీ జడ్పీటీసీ సభ్యుడ కువైట్‌ శంకర్‌, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి యర్రగుడి సురేష్‌ సోమవా రం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ చేపట్టిన యువగళం పాద యాత్ర చరిత్ర సృష్టించిందన్నారు. యువగళం ముగింపు సభకు టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావాలన్నారు. సభకు వెళ్లే వారి కోసం మంగళవారం తిరుపతి నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారన్నారు. ఈ సమావేశంలో పెద్దమండ్యం మాజీ కన్వీనర్‌ సిద్ధవరం ప్రసాద్‌, మండల ప్రధాన కార్యదర్శి వెంకటస్వా మి, నాయకులు రామాంజులునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:47 PM