ఆందోళన తెలుపుతున్న పేద రైతులు
ABN , First Publish Date - 2023-03-02T23:13:28+05:30 IST
మదనపల్లె-తిరుపతి జాతీయ రహ దారి కోసం అనుమతుల్లేకుండా పేదల భూముల్లోని మట్టిని అక్ర మంగా తరలిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు గురువారం నిరసన చేపట్టారు.
రైతుల నిరసన.. సీపీఎం నేతల మద్దతు
మదనపల్లె అర్బన, మార్చి2: మదనపల్లె-తిరుపతి జాతీయ రహ దారి కోసం అనుమతుల్లేకుండా పేదల భూముల్లోని మట్టిని అక్ర మంగా తరలిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు గురువారం నిరసన చేపట్టారు. ఈ నిరసనకు సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీని వాసులు మాట్లాడుతూ మదనపల్లె- తిరుపతి జాతీయ రహదారి పక్కన ఉన్న బసినికొండ గ్రామ రెవెన్యూ సర్వే 1130, 987 నెం బర్లులో ఉన్న పేదల భూములను అక్రమించుకుని జాతీయ రహ దారికి మట్టిని వాడుకోవడమే కాకుండా, ప్రైవేట్ వ్యక్తులకు టిప్పర్ లోడు రూ. 4 వేలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. 987 సర్వే నెంబరులో అనుమతులు తీసుకున్న హైవే కాంట్రాక్టర్ 1130 సర్వే నెంబరుల్లో పేదల పేరుతో ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా భూ ముల్లో అక్రమ మట్టి వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం తెలిసినా రెవెన్యూ అఽధికారులు నోరు మెదపడం లేదన్నారు. మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువులుచ వంకలు వాగులు, శ్మశానాలు కబ్జాకు గురవుతున్న రెవెన్యూ ఇరిగేష న అధికారులకు ఏమి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. పేదల భూములలో మట్టి జోలికి ఎవరూ రాకూడదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళి, రైతులు పాల్గొన్నారు.