కాలువ పనులు పూర్తి చేయకుంటే ఆందోళన

ABN , First Publish Date - 2023-03-25T23:41:15+05:30 IST

కాలువను పూర్తి చేయకపోతే పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అంకిరెడ్డి, ముస్లిం మైనార్టీ కడప పార్లమెంటు అధ్యక్షుడు ఖాదర్‌బాషా హెచ్చరించారు.

కాలువ పనులు పూర్తి చేయకుంటే ఆందోళన
13వ వార్డులో పర్యటించిన టీడీపీ నాయకులు

కమలాపురం రూరల్‌, మార్చి 25 : కాలువను పూర్తి చేయకపోతే పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అంకిరెడ్డి, ముస్లిం మైనార్టీ కడప పార్లమెంటు అధ్యక్షుడు ఖాదర్‌బాషా హెచ్చరించారు. శనివారం నగర పంచాయతీ పరిధిలోని 12, 13వ వార్డుల్లో వారు పర్యటించారు. కమలాపురం పట్టణం పంచాయతీగా పంచాయతీ నుంచి నగర పంచాయతీగా మార్చినప్పటి నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెబుతున్న నాయకులు ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేశారో తెలపాలన్నారు. నగర పంచాయతీలో ప్రధానంగా టీడీపీ కౌన్సిలర్లు గెలిన 12, 13 వార్డుల్లో అభివృద్ధి పనులను పూర్తిగా వదిలేశారన్నారు. అభివృద్ధి చేయాలని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం పరిపాటిగా మారిందన్నారు. వెంటనే మురికినీరు నిలబడిన చోట నిల్వ లేకుం డా చేయాలని నాలుగురోజుల్లో ఈ పనులు చేపట్టకుంటే ప్రజలతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కమలాపురాన్ని నగర పంచాయతీగా మార్చి ఉపాధి పనులు లేకుండా ప్రజల కడుపు కొట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ జంపాల నరసింహారెడ్డి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, రైతు సంఘం నాయకులు ప్రభాకర్‌రెడ్డి, దాదిరామయ్య, మల్లే్‌షరాయల్‌, నబీ రసూల్‌, వేణుగోపాల్‌రెడ్డి, దివాకరరెడ్డి, టీడీపీ కౌన్సిలర్‌ బాబుల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:41:15+05:30 IST