పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , First Publish Date - 2023-08-02T23:54:38+05:30 IST
పౌష్టికాహారంతో తల్లీబిడ్డ సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని వైసీపీ సిటీ కార్యదర్శి బక్యా శ్యామ్ పేర్కొన్నారు.
కడప (మారుతీనగర్), ఆగస్టు2: పౌష్టికాహారంతో తల్లీబిడ్డ సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని వైసీపీ సిటీ కార్యదర్శి బక్యా శ్యామ్ పేర్కొన్నారు. బుధవారం మాసాపేటలోని అంగన్వాడీ కేంద్రంలో 26వ డివిజను వైసీపీ ఇనచార్జ్ చిగురుపాటి త్యాగరాజు సారథ్యంలో వైఎ్‌సఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ పోషణలో భాగంగా ప్రతి గర్భిణీకి పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గర్భిణులకు ఒక్కొక్కరికి 3 కేజీల బియ్యం కిలో కందిపప్పు, కిలో అటుకులు, అరకిలో ఆయిల్,
25 గుడ్లు, 5 లీటర్ల పాలు, కిలో రాగిపిండి, జొన్నపిండి, ఖర్జూరాలు, బెల్లం తదితర కిట్లను పంపిణీ చేశారు. ఇందులో సచివాలయ కన్వీనరు షేక్ సలీం, నాయకులు కంచుపాటి బాబు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.