రసవత్తరంగా బండలాగుడు పోటీలు

ABN , First Publish Date - 2023-05-25T22:43:38+05:30 IST

ఇడమడకలో పెద్దమ్మ తల్లి దేవర సందర్భంగా ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలు ఆసక్తికరంగా జరిగాయి.

రసవత్తరంగా బండలాగుడు పోటీలు
బండలాగుతున్న ఎడ్లు

దువ్వూరు, మే 25: ఇడమడకలో పెద్దమ్మ తల్లి దేవర సందర్భంగా ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలు ఆసక్తికరంగా జరిగాయి. న్యూకేటగిరీ విభాగంలో జరిగిన పోటీల్లో నంద్యాల జిల్లా పెద్దకొట్టాలు గ్రామం బోరెడ్డి కేశవరెడ్డి ఎడ్లజత ప్రథమ బహుమతి రూ.75 వేలు, కర్నాటక రాష్ట్రం రాయచూర్‌ వాసి ఖాజా హుస్సేన్‌ ఎడ్లజత రెండో బహుమతి రూ.50 వేలు, మైదుకూరుకు చెందిన కుర్రా వెంకటేష్‌యాదవ్‌ ఎడ్లజత మూడో బహుమతి రూ.30 వేలు, నంద్యాల జిల్లా చిన్నకానాల వాసి గుండం చెన్నారెడ్డి ఎడ్ల జత 4వ బహుమతి రూ.20 వేలు, బాపట్ల జిల్లా వేటపాళెం గ్రామానికి చెందిన అతోటి శిరీషాచౌదరి, శివకృష్ణచౌదరి (ఆర్కెబుల్స్‌) ఎడ్లజత 5వ బహుమతి రూ.10 వేలు గెలుపొందాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు కేరింతుల కొడుతూ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T22:43:38+05:30 IST