Share News

అంగన్‌వాడీలపై సీఎం వైఖరి దుర్మార్గం

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:01 PM

తమ సమస్యలు పరిష్కరించాలని వారం రోజులుగా అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన పట్టించుకోక పోగా, తాళాలు పగలగొట్టి అంగన్‌వాడీ కార్యాల యాలు తెరవడం దుర్గార్మని టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్‌ మోహన్‌రాజు విమర్శించారు.

అంగన్‌వాడీలపై సీఎం వైఖరి దుర్మార్గం
రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడుతున్న కస్తూరి విశ్వనాథ నాయుడు

రాజంపేట, డిసెంబరు 17 : తమ సమస్యలు పరిష్కరించాలని వారం రోజులుగా అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన పట్టించుకోక పోగా, తాళాలు పగలగొట్టి అంగన్‌వాడీ కార్యాల యాలు తెరవడం దుర్గార్మని టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్‌ మోహన్‌రాజు విమర్శించారు. రాజంపేట పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావే శంలో మా ట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అంగన్‌వాడీల పోస్టులను రెగ్యులర్‌ చేస్తామని, కనీస వేతనం, అలవెన్సులు ఇస్తామని చెప్పిన జగన్‌రెడ్డి, అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లైనా వాటిని అమలు చేయలేదన్నారు. ఇకనైనా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటు కార్యనిర్వాహకార్యదర్శి కోవూరు సుబ్రమణ్యం నాయుడు , మండల పార్టీ ఉపాధ్యక్షుడు సతీష్‌ రాజు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మోహన్‌బాబునాయుడు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరు: అంగన్వాడీ కార్యకర్తల పై జగన్‌రెడ్డి ఉక్కుపాదం మోపడం సబబు కాదని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు తెలిపారు. ఆదివారం రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లను బద్దలు కొట్టే అధికారం ముఖ్యమంత్రి కి లేదన్నారు. అంగన్వాడీలు సమస్య లు అడగడం తప్పా అని ప్రశ్నించారు. అంగన్వాడీలకు చేయూత నిచ్చి జీతాలు పెంచిన ఘనత టీడీపీదే అని గుర్తు చేశారు. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరా టాలు చేస్తున్నారన్నారు. చేతగాని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వారిపై కక్షగట్టి ఉక్కు పాదం మోపుతున్నారన్నారు. తనను మించిన మహిళా పక్షపాతి ఎవరూ లేరంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచి కొడుతున్నారన్నారు. అంగన్వాడీలపై లాఠీ చార్జీ, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, శిబిరాలు తొల గింపు వంటి చర్యల అవసరం ఏమొచ్చిందన్నారు. ముఖ్యమంత్రి నడుపు తున్న ప్రభుత్వమా లేక ప్రైవేటు సైన్యామా అని ప్రశ్నించారు. అలవిగాని హామీలిచ్చి అధికారం లోకి వచ్చిన తర్వాత మాట తప్పడం అలవాటుగా మారిందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్‌ ఉన్నా అరకొరగా వేతనాలు పెంచి జగన్‌రెడ్డి అంగన్వాడీలను మోసం చేశాడన్నారు. ముఖ్య మంత్రికి గుజరాత్‌ సంస్థ అమూల్‌పై ఉన్న మమకారం ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నారులపై లేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కళ్లు తెరిచి అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల ను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాది కేజేపీ రెడ్డయ్య నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మా శివ, సీనియర్‌ నాయకుడు గడికోట సుబ్బరాయుడు, విజయ్‌వర్మ, రాజంపేట పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు పులేల రమేష్‌, రాజంపేట పార్లమెంట్‌ కార్యనిర్వహణ కార్యదర్శి సయ్యద్‌ మోహతాజ్‌, రాజంపేట పార్ల మెంట్‌ వాణిజ్య విభాగం కార్యదర్శి బుంగటావుల రాజశేఖర్‌, స్థానిక నాయకులు రమణ, శివ, అభిషేక్‌, మైనార్టీ నాయకులు జాక్రియ, గడ్డం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:01 PM