Share News

చెత్త మీద పన్ను వేసిన సీఎం జగన ఒక్కడే..!

ABN , Publish Date - Dec 28 , 2023 | 10:50 PM

చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి దేశంలో జగన ఒక్క డేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు.

చెత్త మీద పన్ను వేసిన సీఎం జగన ఒక్కడే..!
పీలేరులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి

నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి

పీలేరు, డిసెంబరు 28: చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి దేశంలో జగన ఒక్క డేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. పీలేరు పట్టణంలోని సదుం రోడ్డు, చిన్న మసీదు, బ్రా హ్మణ వీధి ప్రాంతాల్లో టీడీపీ, జనసేన శ్రేణు లతో కలిసి గురువారం ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చ దనం, పరిశుభ్రత కాపాడడం ప్రభుత్వ బాధ్యత కాగా ఆ బాధ్యతను కూడా డబ్బుగా మార్చు కున్న ఘనత జగనదేనన్నారు. ప్రజలకు తాయి లాలు పంచి, తన పార్టీ వారికి వందల కోట్ల రూపాయలు దోచిపెడుతున్న ఆయన వైఖ రిని రాష్ట్ర ప్రజలు పసిగట్టారని, వచ్చే ఎన్నికల్లో ఇం టికి పంపేందుకు సిద్ధపడిపోయారన్నారు. ఈ విషయాన్ని పసి గట్టిన ఆయన దొంగ ఓట్లతో మరోమారు అధికారంలోకి వచ్చేందుకు దొడ్డి దారి ప్రయత్నాలు ముమ్మరం చేశాడన్నారు. సంపద సృష్టించడం, దానిని పేదలకు పంచి పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, ఆయన కారణంగా గతంలో రాష్ట్రానికి అనేక అంతర్జాతీయ సంస్థలు వచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీలేరు నియోజవర్గ జనసేన ఇనచార్జి బెజవాడ దినేశ, టీడీపీ పరిశీలకులు సూరా సుధాకర్‌ రెడ్డి, నాయకులు మద్దిపట్ల సూర్యప్రకాశ, శ్రీకాంత రెడ్డి, మల్లెల రెడ్డిబాషా, పురం రామ్మూర్తి, కోడి రామకృష్ణారెడ్డి, పిట్టా భాస్కరరెడ్డి, సహదేవ, జీవీ రవికుమార్‌, ఇస్మా యిల్‌, షౌకతఅలీ, చాన బాషా, రహంతుల్లా, పురం రెడ్డమ్మ, సాధన, ఈశ్వర, ముబారక్‌, ఎన్టీఆర్‌ నఫీస్‌, జహీర్‌, మహబూబ్‌ బాషా, రెడ్డిముని, రెడ్డిశేఖర, జనసేన నాయకులు కలప రవి, గజేంద్ర, షఫీ, గౌస్‌ పాల్గొన్నారు.

కలికిరి: సన్యాసివారిపల్లెతో తమ కుటుంబానికి యాభై ఏళ్ళ అనుబంధముందని, రాబోయే ఎన్నికల్లో తమ కుటుంబంలోని సభ్యుడుగా తనను ఆదరించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి కోరారు. మేడికుర్తి పంచాయతీలోని సన్యాసివారిపల్లెలో గురువారం బాబు ష్యూరిటీ భవిషత్తుకు గ్యారెం టీ మహిళాశక్తి హామీలకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. రా జంపేట పార్లమెంటు ఉపాధ్యక్షుడు వాసునూరి చంద్రశేఖర్‌, మండల టీడీపీ అధ్యక్షుడు నిజా ముద్దీన, సురేష్‌కుమార్‌ రెడ్డి, జనార్ధన, అంగడి బాబు, అమర, దాము, జగదీష్‌, మహ్మదాలీ, శ్రీఽ దర్‌, పూర్ణచంద్ర, గంగరాజు, అగస్తి, వర్మ, మేడి కుర్తి మాజీ సర్పంచ మహ్మద్‌ గౌస్‌, సుధాకర్‌ రెడ్డి, ఆనంద రెడ్డి, మాజీ జడ్పీటీసీ మాలతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 10:50 PM