వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించాలి
ABN , First Publish Date - 2023-02-08T23:16:18+05:30 IST
బాలికల వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని వసతి గృహా ల ప్రత్యేక అధికారి జిల్లా పంచాయతీ రాజ్ సూపరింటెండింగ్ ఇంజినీరు సురేష్‌కుమార్ ఆదేశించారు.
కలికిరి, ఫిబ్రవరి 8: బాలికల వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని వసతి గృహా ల ప్రత్యేక అధికారి జిల్లా పంచాయతీ రాజ్ సూపరింటెండింగ్ ఇంజినీరు సురేష్‌కుమార్ ఆదేశించారు. ప్రధానంగా బాలికల వసతి గృహా ల్లో పర్యవేక్షణ బాధ్యతలను సమష్టిగా తీసుకో వాలని సూచించారు. ఇటీవల వాల్మీకిపురం బాలికల రెసిడెన్షియల్ కళాశాల సంఘటన నేప థ్యంలో వసతి గృహాల తనిఖీలకు పీఆర్ ఎస్‌ఈ సురేష్‌కుమార్‌కు కలెక్టర్ పర్యవేక్షక బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన బుధవారం స్థాని క జ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాల ను సందర్శించారు. విద్యార్థినులకు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించాలని మేడికుర్తి వైద్యాఽ దికారిణి డాక్టర్ కావ్యగంధకు సూచించారు. వైద్య పరీక్షల వివరాల నమోదుకు ప్రత్యేక రిజి స్టరు ఏర్పాటు చేయాలన్నారు. వసతి గృహంలో అవాంఛనీయ ఘటనలు జరిగితే చర్యలు తప్ప వని హెచ్చరించారు. ప్రిన్సిపాల్ సోమశేఖర్ వసతి గృహం నిర్వహణ తీరునువివరించారు. ఉపాధ్యాయులకు సూచనలిచ్చారు.