లేగదూడల పెంపకం ఆదాయవనరు

ABN , First Publish Date - 2023-04-03T23:39:31+05:30 IST

పాడి రైతులు పాల దిగుబడితోపాటు లేగదూడల పెంపకం ఆదాయకరమని డీఎల్‌డీఏ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రమేష్‌ పేర్కొన్నారు.

లేగదూడల పెంపకం ఆదాయవనరు

దువ్వూరు, ఏప్రిల్‌ 3: పాడి రైతులు పాల దిగుబడితోపాటు లేగదూడల పెంపకం ఆదాయకరమని డీఎల్‌డీఏ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రమేష్‌ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని చిన్నసింగనపల్లె గ్రామంలో లేగ దూడల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ పాడి రైతులు లేగదూడల పెంపకంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వేసవి కాలంలో వ్యాధు లు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండల పశువైద్య అధికారి శ్రీహరి, ఫణీంద్రారెడ్డి, డాక్టర్‌ శివరాంరెడ్డి, డాక్టర్‌ చిరంజీవి, ఉపసర్పంచ్‌ పద్మనాభరెడ్డి, సచివాలయ సహాయ పశువైద్య అధికారి రవీంద్ర, రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T23:39:42+05:30 IST